: మరో విజయానికి ఆమ్ఆద్మీ కసరత్తు
గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ఆద్మీపార్టీ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగరేయడానికి కసరత్తు చేస్తోంది. ఢిల్లీ పరిధిలోని మూడు స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 13 వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగడంతో కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 13 వార్డుల్లో విజయమే లక్ష్యంగా ఆమ్ఆద్మీ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది.