: 84 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకున్న మీడియా మొఘల్
84 ఏళ్ల ముదిమి వయసులో మీడియా మొఘల్ 'న్యూస్ క్రాఫ్ట్ ఛైర్మన్' రూపర్డ్ మర్డోక్ పెళ్లికొడుకయ్యారు. లండన్ లో ప్రిన్స్ డయానా పూర్వీకుల భవనమైన స్పెన్సర్ హౌజ్ లో నిరాడంబరంగా ప్రేయసి, మాజీ సూపర్ మోడల్ జెర్రీ హాల్ (59)ను రూపర్డ్ మర్డొక్ వివాహం చేసుకున్నారు. జెర్రీ హాల్ ను ఆస్ట్రేలియాలో ఐదు నెలల క్రితం ఆయన కలిశారు. ఇన్నేళ్ల వయసులో తొలి చూపులోనే ఆమెతో ఆయన ప్రేమలో పడ్డారు. గత అక్టోబర్ లో లండన్ లో జరిగిన రగ్బీ యూనియన్ వరల్డ్ కప్ ఫైనల్ లో వీరిద్దరూ ఫోటోలకు పోజులిచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అంతా అనుకున్నారు. గత జనవరిలో లాస్ ఏంజిలెస్ లో వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహం సందర్భంగా 4.2 మిలియన్ పౌండ్ల ఉంగరం జెర్రీ హాల్ చేతికి మర్డోక్ తొడగడం విశేషం. తాను ప్రపంచంలోనే అదృష్టవంతుడినని, సంతోషం నిండిన వాడినని మర్డోక్ ట్వీట్ చేశారు.