: సల్మాన్ తో మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా...తడబడతా: బాలీవుడ్ భామ డైసీ షా


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ నటీమణుల్లో ఓ క్రేజ్ ఉంది. సల్మాన్ ను చాలా మంది నటీమణులు అభిమానిస్తారు. వారిలో డైసీ షా ఒకరు. 'తేరే నామ్' సినిమాలో బ్యాక్ డాన్సర్ గా పని చేసిన డైసీ షాకు సల్మాన్ 'జై హో' సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా పరాజయం పాలైనప్పటికీ 'హేట్ స్టోరీ3'లో హీరోయిన్ గా నటించమని సూచించాడు. ఈ సినిమాలో అందాల ఆరబోతతో డైసీ షాకు మంచి గుర్తింపే వచ్చింది. ఈ సందర్భంగా డైసీ మాట్లాడుతూ, సల్మాన్ తో మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడతానని చెప్పింది. సల్మాన్ ను తొలిసారి కలిసినప్పుడు ఒక అభిమానిగా తన కోరిక తీరిందని పేర్కొంది. సల్మాన్ కు తాను వీరాభిమానినని చెప్పిన డైసీ, ఆయనతో ఎప్పుడు మాట్లాడినా తడబడుతుంటానని వెల్లడించింది. ప్రస్తుతానికి స్క్రిప్టులు వింటున్నానని, ఇంకా ఏ కథను ఓకే చేయలేదని డైసీ షా తెలిపింది.

  • Loading...

More Telugu News