: వాట్స్ యాప్ మెసేజ్ కి స్పందించిన కేటీఆర్!


తమ కాలనీలో నెలకొన్న సమస్యపై హైదరాబాద్, బీఎన్ రెడ్డి నగర్ వాసులు వాట్స్ యాప్ ద్వారా పంపిన సమాచారానికి తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇక్కడి గాంధీ చిల్డ్రన్స్ పార్కులో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు మంత్రికి సమాచారం పంపారు. దీన్ని చూసిన కేటీఆర్, తక్షణం చెత్తను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన డిప్యూటీ కమిషనర్ పంకజ, తన సిబ్బందిని అలర్ట్ చేసి చెత్తను తొలగించారు. సమస్యపై ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందిస్తామని, ప్రజలు సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News