: అవును, పెళ్లి చేసుకున్నాను: ప్రీతి జింటా
బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఎట్టకేలకు తన వివాహంపై నోరువిప్పింది. బాలీవుడ్ మొత్తం సోషల్ మీడియా ద్వారా ప్రీతి జింటాకు వివాహశుభాకాంక్షలు చెప్పడంతో తన వివాహం జరిగిన సంగతి మీడియాకు తెలిసింది. దీంతో అధికారిక సమాచారం లేనప్పటికీ వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా తన వివాహం జరిగిందని ధ్రువీకరించింది. తన ప్రియుడు జీన్ గుడ్ ఇనోను వివాహం చేసుకున్న మాట వాస్తవమేనని చెప్పింది. మొన్నటివరకు మిస్ ప్రీతిగా ఉన్న తాను, ఇప్పుడు మిసెస్ గుడ్ ఇనోను అయ్యానని తెలిపింది. లాస్ ఏంజిలెస్ లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరిగిందని ప్రీతి వెల్లడించింది. తనకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలని ప్రీతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.