: పిచ్చి ముదిరిన బంగ్లా ఫ్యాన్స్ పెట్టిన ఫోటో... భారత అభిమానుల రక్తం మరిగిస్తోంది!


బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానుల పిచ్చి వెర్రితలలు వేస్తోంది. మరికొన్ని గంటల్లో ఆసియా కప్ టీ-20 ఫైనల్ జరగనున్న వేళ, బంగ్లా అభిమాని ఒకరు పోస్ట్ చేసిన ఫోటో, దానికి వచ్చిన 'షేర్'ల సంఖ్య చూస్తుంటే సగటు భారత క్రికెట్ అభిమాని రక్తం మరిగిపోతోంది. ధోనీ తలను నరికిన ఓ బంగ్లా క్రికెటర్, దాన్ని పట్టుకెళ్తున్నట్టు గ్రాఫిక్స్ తో ఓ చిత్రాన్ని తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇలా చేయడం బంగ్లాకు కొత్తేమీ కాదు. గత సంవత్సరం వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ పై పరాజయం తరువాత కూడా ధోనీ సేన అరగుండ్లు చేయించుకున్నట్టు ఫోటోలను మార్ఫింగ్ చేశారు. ఇక నేటి ఫైనల్ లో మోర్తాజా ఆధ్వర్యంలో తమ జట్టు ఇండియాను మట్టి కరిపిస్తుందని బల్లగుద్ది చెబుతున్నారు. ఎంత వీరాభిమానం ఉన్నా, అది దురాభిమానం కారాదని భారత అభిమానులు ప్రతి ట్వీట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News