: తమిళనాట మళ్లీ అమ్మే వస్తుంది!: 'సీ ఓటర్స్' సర్వే!


తమిళనాడులో మరోసారి పురచ్చితలైవి జయలలిత ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహిస్తారని 'సీ ఓటర్స్' సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి అన్నాడీఎంకేకు పట్టం కడతారని, అయితే, ఇప్పుడున్నంత మెజారిటీ మాత్రం దక్కదని తేల్చింది. అన్నాడీఎంకేకు 116, డీఎంకేకు 101 సీట్లు రావచ్చని తమ సర్వేలో వెల్లడైనట్టు సీ ఓటర్స్ పేర్కొంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 18 స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకుంటాయని అంచనా వేసింది. కాగా, ప్రస్తుత శాసనసభలో అన్నాడీఎంకే 150 స్థానాలను కలిగివున్న సంగతి తెలిసిందే. కూటమితో కలిపితే ఆ పార్టీ బలం 203. కాగా, డీఎంకే కూటమికి 31 సీట్లు మాత్రమే ఉన్నాయి.

  • Loading...

More Telugu News