: మతిభ్రమించిన జగన్: మీడియా ముందు ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు
వైకాపా అధినేత వైఎస్ జగన్ మతిభ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన కుటుంబానిది నేర చరిత్రని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు విమర్శించారు. జగన్ పార్టీ మునిగిపోతున్న నావ వంటిదని, అందువల్లే అందులో ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకోలేకనే ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వస్తున్నారని అన్నారు. జగన్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికే ఆయన్ను ఛీకొట్టిన ప్రజలు, మరింతగా దూరం పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న ఆయన జైలుకు వెళ్లే రోజు త్వరలోనే రానుందని జోస్యం చెప్పారు.