: ప్రభుత్వ హామీని లెక్క చేయని జ్యూయెలర్స్... ఐదో రోజుకు చేరిన సమ్మె!


ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని, రూ. 2 లక్షలకు పైబడిన కొనుగోళ్లపై పాన్ కార్డు వివరాల నమోదు తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ, దేశవ్యాప్తంగా జ్యూయెలర్స్ మొదలు పెట్టిన నిరవధిక సమ్మె ఐదో రోజుకు చేరింది. ఈ విషయంలో ఆభరణాల వర్తకందారుల అనుమానాలను నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చినప్పటికీ, తక్షణ నిర్ణయాన్ని డిమాండ్ చేస్తూ, 7వ తేదీ వరకూ సమ్మెను కొనసాగించేందుకే ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్, ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయెలరీ ట్రేడ్ ఫెడరేషన్ నిర్ణయించాయి. వెండి మినహా, మిగతా అన్ని రకాల ఆభరణాలపై ఎక్సైజ్ సుంకాలను ఈ రంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త పన్నులు, నిబంధనలతో చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురీందర్ కుమార్ జైన్ వెల్లడించారు. ఈ విషయమై సమీక్షిస్తామని అరుణ్ జైట్లీ నుంచి హామీ వచ్చిందని తెలిపారు.

  • Loading...

More Telugu News