: పక్కవాళ్లు చందాలిస్తే, చదువుకున్నా: దాసరి
తన చిన్నతనంలో పక్క విద్యార్థుల చందాల సాయంతో చదువు కొనసాగించానని, తన ఇంట అంత ఘోర పరిస్థితి ఉండేదని దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్, అలకాపురి కాలనీలో ఓ స్కూల్ ను ప్రారంభించిన ఆయన, అనంతరం మాట్లాడుతూ, తన బాల్యానికి సంబంధించిన విషయాలు నెమరేసుకున్నారు. పేదరికంతో ఓ సంవత్సరం బడికి వెళ్లలేదని గుర్తు చేసుకున్న ఆయన, సహచరులు అందరూ చందాలు వేసుకుని తనకు డబ్బివ్వగా, చదువు సాగించానని, చదువు విలువ తనకు బాగా తెలుసునని అన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలకు మెరుగైన విద్య కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారని, మెరుగైన చదువుల కోసమే ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని అన్నారు.