: చెడ్డపేరు తెచ్చే పన్నులు వద్దు... జైట్లీతో నరేంద్ర మోదీ!


ప్రభుత్వంపై ప్రజల నుంచి విమర్శలు వచ్చేలా చేసిన ప్రావిడెంట్ ఫండ్ పై పన్నుల విషయాన్ని సమీక్షించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అరుణ్ జైట్లీతో చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రజలు రిటైర్ మెంట్ అనంతరం ఉపయుక్తకరంగా ఉండేలా దాచుకునే భవిష్యనిధిలో 60 శాతం సొమ్మునకు లభించే వడ్డీపై పన్ను వేయాలని జైట్లీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రాగా, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఈ పన్ను తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని మోదీ సూచించినట్టు తెలుస్తోంది. మోదీ సూచించినట్టుగా, ఆర్థిక శాఖ ఈ పన్నును వెనక్కు తీసుకుంటే, నెలకు రూ. 15 వేల కన్నా అధికంగా వేతనం తీసుకుంటున్న 60 లక్షల మంది ఈపీఎఫ్ చందాదారులకు వెసులుబాటు కలుగుతుంది.

  • Loading...

More Telugu News