: నాటకీయ పరిణామాల మధ్య లొంగిపోయిన మంత్రి రావెల తనయుడు సుశీల్


ఓ ముస్లిం మహిళను వేధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ నాటకీయ పరిణామాల మధ్య గత రాత్రి ఒంటి గంట సమయంలో హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ కేసులో సుశీల్ ప్రయాణించిన కారు డ్రైవర్ కూడా లొంగిపోయాడు. సుశీల్ పై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు న్యాయవాదులు సుశీల్ కి స్టేషన్ బెయిల్ కోసం పోలీసులను సంప్రదించినప్పటికీ, నిర్భయ చట్టం కావడంతో బెయిల్ ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం సుశీల్, డ్రైవర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నేడు లేదా రేపు సుశీల్ ను న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News