: నేను తలచుకుంటే మూడు నిమిషాల్లో చంద్రబాబును దించగలను: ముద్రగడ


టీడీపీ నేతల విమర్శలపై కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరిజిల్లాలో ఆయన మాట్లాడుతూ, తాను తల్చుకుంటే మూడు నిమిషాల్లో చంద్రబాబును దించగలనని అన్నారు. అయితే అలాంటి కుట్రలకు వ్యతిరేకినని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, తాను ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చామని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు దగ్గర డబ్బు ఉండడం వల్ల ఆయన ఉన్నత పదవులు అలంకరించారని, తన దగ్గర డబ్బు లేని కారణంగా ఉన్నతపదవులు అలంకరించలేకపోయానని ఆయన చెప్పారు. టీడీపీ నేతలు విమర్శలు చేయడం, ఎద్దేవా చేయడం మాని కాపులకు ఏం చేయాలో ఆలోచించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News