: ప్రేమోన్మాది దాడిలో గాయపడిన ఇందుమతి మృతి


పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కేతపర్రులో ఇంట్లో పరీక్షల కోసం చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని ఇందుమతిపై ప్రేమోన్మాది చినవెంకులు కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఇందుమతి మృత్యువుతో పోరాడుతూ తనువు చాలించింది. ఆసుపత్రిలో తీవ్ర వేదన అనుభవించిన ఇందుమతి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, ఘాతుకానికి పాల్పడిన చినవెంకులు పరారీలో ఉన్నాడు. చినవెంకులును పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, గత కొంత కాలంగా తనను ప్రేమించాలని వేధిస్తూ చినవెంకులు ఆమె వెంటపడేవాడని, ఆమె అందుకు అంగీకరించకపోవడంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో పథకం ప్రకారం ఇంట్లో దూరి, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News