: సచిన్ వేరు...కోహ్లీ వేరు: అఫ్రిదీ


సచిన్ వేరు కోహ్లీ వేరు అని పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చెప్పాడు. ఆసియాకప్ లో జట్టు ప్రదర్శనపై ఆయన మాట్లాడుతూ, సచిన్ కు కోహ్లీకి పోలిక లేదని అన్నాడు. సచిన్ కేవలం భారతదేశానికే కాదు ప్రపంచ క్రికెట్ కు ఆదర్శమని అఫ్రిదీ చెప్పాడు. ప్రపంచ దేశాల్లో సచిన్ కు అభిమానులు ఉన్నారని అన్నాడు. కోహ్లీ ఆటతీరులో దూకుడు నచ్చుతుందని అఫ్రిదీ తెలిపాడు. ప్రపంచంలోని బెస్ట్ హిట్టర్స్ లో కోహ్లీ ఒకడని, తనదైన రోజున కోహ్లీ విశ్వరూపం ప్రదర్శిస్తాడని అఫ్రిదీ పేర్కొన్నాడు. ఆసియాకప్ లో తాము కీలక సమయాల్లో తప్పులు చేశామని చెప్పాడు. అయితే చేసిన తప్పుల నుంచి నేర్చుకోలేదని పేర్కొన్నాడు. నిషేధం తరువాత అమీర్ తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేశాడని అఫ్రిదీ ప్రశంసించాడు. స్కోరు బోర్డు మీద సరైన లక్ష్యం లేకపోతే బౌలర్లు మాత్రం ఏం చేయగలరని అఫ్రిదీ ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News