: కన్నయ్య కుమార్ ప్రసంగం ఆలోచింపజేసేదిగా ఉంది: శత్రుఘ్నసిన్హా ప్రశంసలు


జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ నాయకుడు కన్నయ్య కుమార్ తీహార్ జైలు నుంచి విడుదలైన తరువాత చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందని బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్నసిన్హా ప్రశంసించారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, బీహార్ పుత్రుడు కన్నయ్య కుమార్ చేసిన ప్రసంగం అద్భుతంగా, ఆలోచింపజేసిదిగా ఉందని, మంచి ప్రసంగమని అన్నారు. కాగా, మోదీని విమర్శిస్తూ కన్నయ్య చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో, బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్నసిన్హా అతనిని ప్రశంసించడం విశేషం.

  • Loading...

More Telugu News