: 10న ఏపీ బడ్జెట్...16 రోజులు సమావేశాలు


ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలపై స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ గైర్హాజరయ్యారు. ఆ పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలు 16 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్టును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా శాసనసభలో చర్చించనున్న 17 అంశాలను టీడీఎల్పీ బీఏసీ ముందు పెట్టింది.

  • Loading...

More Telugu News