: కోల్ కతా విమానాశ్రయంలో ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం


పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళల నుంచి ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...ఫ్రాన్స్ కు చెందిన ఇద్దరు మహిళలు దుబాయ్ మీదుగా ఇటలీ వెళ్లేందుకు కోల్ కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. చెకిన్ అయ్యే సమయంలో వారి హ్యాండ్ బ్యాగ్ లో అనుమానిత వస్తువులున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో వారి బ్యాగేజ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, వాటి నుంచి ఐదు రౌండ్ల బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో వారిని విచారించిన అధికారులు వారిద్దరిదీ ఫ్రాన్స్ అని, వారిద్దరూ తళ్లీకూతుళ్లని గుర్తించారు. వారిద్దరినీ మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News