: మరో 25 ఏళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలి: అమిత్ షా
మరో 25 ఏళ్ల పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగేలా కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. బీజేపీ యువ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మరో 25 ఏళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే అప్పుడు భారత్ విశ్వగురువుగా అవతరిస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జేఎన్ యూకు వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. జాతి వ్యతిరేక నినాదాలు చేయడాన్ని వాక్ స్వాతంత్య్రం హక్కు అనడం ఎంత వరకు సమంజసమని ఆయన అడిగారు. తన కుమారుడి వ్యాఖ్యలపట్ల సోనియా గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.