: హైదరాబాదులో ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం
హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టులో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి ఘనస్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన సందర్భంగా హైదరాబాదు వచ్చిన ఉపరాష్ట్రపతికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతికి సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులను, గ్రేటర్ హైదరాబాదు మేయర్ బొంతు రామ్మోహన్ ను పరిచయం చేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి విడిదికి చేరుకున్నారు.