: కన్నయ్య కుమార్ తలకు వెల...11 లక్షలంటూ వెలసిన పోస్టర్లు


జేఎన్ యూ స్టూడెంట్ నాయకుడు కన్నయ్య కుమార్ నాలుక కోస్తే 5 లక్షల రూపాయలు ఇస్తానంటూ బీజేపీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గకుండానే, మరో వివాదం రేగింది. కన్నయ్య కుమార్ తలకు వెల కడుతూ పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ శర్మ కొడుకు పేరుతో ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. 'దేశద్రోహి కన్నయ్య కుమార్ ను కాల్చిచంపితే 11 లక్షల రూపాయల రివార్డు ఇస్తా'మని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత కన్నయ్య కుమార్ చేసిన ప్రసంగం తనను కలచి వేసిందని ఆదర్శ్ శర్మ పేర్కొన్నారు. ముందు కన్నయ్య కుమార్ నిర్దోషని భావించానని, అయితే, అతని ప్రసంగం విన్న తరువాత తన నిర్ణయం మార్చుకున్నానని ఆయన చెప్పారు. అందుకే తమ సంఘ ప్రతినిధులతో మాట్లాడి, రివార్డును నిర్ణయించి, 1500 పోస్టర్లు వేయించామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News