: నా కుమారుడి కేసులో జోక్యం చేసుకోను: రావెల
తన కుమారుడు సుశీల్ కేసు విషయంలో జోక్యం చేసుకోనని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అతనిపై నిర్భయ కేసు నమోదైందని అన్నారు. ఈ వ్యవహారంలో తానేమీ జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. ఏమైనా దర్యాప్తు తరువాతే నేరం జరిగిందా? లేదా? అనే విషయం తెలుస్తుందని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు ఎవరు చేసినా ఒప్పుకునే వ్యక్తిత్వం తనది కాదని ఆయన అన్నారు. తనకు రాజ్యాంగం, చట్టంపై అత్యంత గౌరవం, విశ్వాసం ఉన్నాయని ఆయన తెలిపారు.