: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చిన్నారి వీడియో


సోషల్ మీడియాలో 'డెలివరింగ్ జాయ్ అండ్ లవ్: లవ్ వాట్ మేటర్స్' అనే వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. మామూలుగా చిన్న పిల్లలు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు లేదా కొత్త వారిని చూసినప్పుడు బిడియంతో ముడుచుకుపోతుంటారు. కానీ ఈ వీడియోలో ఓ చిన్నారి ఓ షాపింగ్ మాల్ లో కలియదిరుగుతూ, ఎలాంటి బెరుకు లేకుండా కనిపించిన ప్రతిఒక్కరినీ పలకరించుకుంటూ వెళ్లింది. అంతేకాదు, ఓ మహిళ దగ్గరకు వెళ్లి ఆమెను గుండెలకు హత్తుకుంది. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేసి మూడు వారాలు కాగా, దీనిని ఇప్పటి వరకు 46 మిలియన్ల మంది వీక్షించారు.

  • Loading...

More Telugu News