: 14 ఏళ్లలో ఆ బాలిక ఒక్క రోజూ డుమ్మా కొట్టలేదు!


చదువును ఇష్టపడే వాళ్లను చూశాం.. ప్రేమించే వాళ్లను చూశాం... కానీ ఈ బాలికకు చదువంటే ప్రాణం. అందుకేనేమో, 14 ఏళ్ల విద్యార్థి జీవితంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఆ బాలిక ఒక్కటంటే ఒక్కరోజూ స్కూల్ కు డుమ్మా కొట్టలేదు. ఇది చాలదా, ఈ బాలిక చదువుల తల్లికి ప్రతిరూపం అనడానికి! పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని డమ్ డమ్ ఆక్సిలియం కాన్వెంట్ లో 12వ తరగతి చదువుతున్న చంద్రజ గుహ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది. కేవలం నూరు శాతం హాజరు మాత్రమే కాదు... ప్రతిభలోనూ చంద్రజ ముందు వరుసలో ఉంటోంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల పరీక్షల్లో ఆమె స్కోర్ ఎన్నడూ 90 శాతానికి తగ్గలేదు. చంద్రజ తన పాఠశాలను ఎంతో ప్రేమిస్తుందని, అదే నూరు శాతం హాజరుకు కారణమని ఆమెకు పాఠాలు చెప్పే టీచర్ అమ్రిత చటర్జీ తెలిపారు. ఇతర విద్యార్థులు కూడా ఆమెను చూసి తెలుసుకోవాలని సూచించారు. నిజానికి పలువురు విద్యార్థులు ఇప్పటికే చంద్రజను ఆదర్శంగా తీసుకుని క్రమం తప్పకుండా స్కూలు కు వెళుతున్నారు. చంద్రజ ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శమని డమ్ డమ్ కిషోర్ భారతి స్కూల్ ప్రిన్సిపాల్ నిత్యరంజన్ బాగ్చి అన్నారు. చంద్రజ విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పార్థా చటర్జీ ఆమెను వికాస భవన్ కు పిలిచి స్వయంగా ఓ సర్టిఫికెట్ ను అందించి భుజం తట్టి పంపారు.

  • Loading...

More Telugu News