: రాంరెడ్డి అంత్యక్రియలు ... అధికారికంగా నిర్వహిస్తున్న టీఎస్ సర్కారు


టీ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని రాంరెడ్డి స్వగ్రామం పాతలింగాలలో ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహిస్తోంది. అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి నిన్న ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. నేటి ఉదయం హైదరాబాదు నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఖమ్మంకు తరలించిన అధికారులు, అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్ధం కొద్దిసేపు ఉంచారు. ఆ తర్వాత ఆయన స్వగ్రామం పాతలింగాలకు పార్థివదేహాన్ని తరలించిన అధికారులు కొద్దిసేపటి క్రితం అంత్యక్రియలను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News