: ప్రధాని జోక్యంతో ఉద్యోగులకు లభించనున్న ఊరట


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ సందర్భంగా ఈపీఎఫ్ ఉపసంహరణలపై పన్నుపోటు వేసి ఉద్యోగులను కంగుతినిపించడం... మంత్రి వర్యుల ప్రతిపాదనలపై ఉద్యోగుల నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం... ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీయే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఆదేశాల మేరకు పదవీ విరమణ సమయంలో ఈపీఎఫ్ నగదు ఉపసంహరణలపై పన్ను పోటును తగ్గించేందుకు లేదా పూర్తిగా ఎత్తివేసేందుకు గల అవకాశాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేసి ఓ నిర్ణయానికి వచ్చింది. దీనిపై శుక్రవారమే ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన చేయాల్సి ఉంది. కానీ మాజీ లోక్ సభ స్పీకర్ పీఏ సంగ్మా మృతితో ఉభయ సభలు వాయిదా పడడంతో నిర్ణయం వెల్లడి కాలేదు. మంగళవారం పార్లమెంటులో దీనిపై నిర్ణయం వెలువడనుంది. 2016 ఏప్రిల్ 1 తర్వాత ఈపీఎఫ్ లో జమయ్యే మొత్తాల నుంచి పదవీ విరమణ సమయంలో ఉపసంహరించుకునే సమయంలో... 60 శాతం మొత్తంపై పన్నును మంత్రి ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News