: ‘జిలానీ’లపై వేటు వేయండి... స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వైపీసీ ఎమ్మెల్యేలు
జంప్ జిలానీలపై వేటు వేయాల్సిందేనని ఏపీలో ప్రతిపక్ష వైసీపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ కు విన్నవించింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని అసెంబ్లీ ఆవరణలో సభాపతి కార్యాలయానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ టికెట్ పై విజయం సాధించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. ఈ విషయంలో స్పీకర్ నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తారని తాము భావిస్తున్నామని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.