: ‘జిలానీ’లపై అనర్హత వేటు వేయండి... స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్న వైసీపీ


ఏసీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజునే వైసీపీ కీలక అడుగు వేయనుంది. తమ పార్టీ టికెట్ పై విజయం సాధించి టీడీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కోరనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నేటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే స్పీకర్ కు ఫిర్యాదు అందజేయనున్నారు. విడతలవారీగా జరిగిన పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం మేరకు వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరనుంది.

  • Loading...

More Telugu News