: అబ్బురపరుస్తున్న ఏపీ అసెంబ్లీ నిర్మాణ నమూనా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం నిర్మాణ కాంట్రాక్టులను దక్కించుకున్న అగ్రగామి కంపెనీలు ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ తమ పనిని వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మించతలపెట్టిన తాత్కాలిక సచివాలయం నిర్మాణ నమూనా చిత్రాలను శుక్రవారం విడుదల చేశాయి. వీటిలో శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణ నమూనాలు చూడ్డానికి అద్భుతంగా ఉన్నాయి. వీటిని శాశ్వతంగా వినియోగించుకునేలా రూపొందించారు. మరోవైపు ప్రభుత్వం కోరినట్టుగా జూన్ లోపే నిర్మాణాలను పూర్తి చేస్తామని ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో జూన్ నుంచి తాత్కాలిక సచివాలయంలోనే అసెంబ్లీ సమావేశాలతోపాటు పరిపాలన కొనసాగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.