: కర్నూలు ఎమ్మెల్యే కొత్త కారు చోరీ... ఇంటిలో పార్క్ చేసిన కారును ఎత్తుకెళ్లిన దొంగలు
వైసీపీ సీనియర్ నేత, కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి ముచ్చట పడి కొనుక్కున్న కొత్త స్కార్పియో కారును దొంగలు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితమే సదరు స్కార్పియో కారును ఎస్వీ మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. కర్నూలులోని ఎమ్మెల్యే ఇంటిలో పార్క్ చేసిన సదరు కొత్త కారును గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి ఎత్తుకెళ్లారు. కారు చోరీకి గురైందని గ్రహించిన ఎస్వీ మోహన్ రెడ్డి చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారు కోసం ముమ్మర గాలింపు ప్రారంభించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటిలో పార్క్ చేసిన కారు చోరీకి గురికావడం అక్కడ పెద్ద చర్చనీయాంశమైంది.