: గుర్రమెక్కిన కొల్లు రవీంద్ర!... మంగినపూడి బీచ్ లో సరదా తీర్చుకున్న ఏపీ మంత్రి


టీడీపీ యువనేత, ఏపీ ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న తన సొంత నియోజకవర్గం మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ లో సరదా సరదాగా గడిపారు. బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్న రవీంద్ర... నిన్న కాస్తంత సేద దీరారు. అనుచరులతో కలిసి మంగినపూడి బీచ్ కు వెళ్లిన ఆయన అక్కడ ఓ గుర్రమెక్కి సరదాగా స్వారీ చేశారు. బ్లూ కలర్ జీన్స్, వైట్ కలర్ షర్ట్ తో సాక్షాత్తు యువత ప్రతినిధిగా గుర్రంపై స్వారీ చేస్తూ మెరిసిపోతున్న కొల్లు రవీంద్ర ఫొటోను ఓ తెలుగు దిన పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.

  • Loading...

More Telugu News