: సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్లు...నేను అర్చకుడ్ని: బాలయ్య
సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్లు...నేను అర్చుకుడ్ని అని తన తండ్రి చెప్పినట్టు...తనకు సినిమా కుటుంబం, అభిమాన కుటుంబం, నియోజకవర్గం అంతా కలసి ఒక కుటుంబమని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. 'సావిత్రి' ఆడియో వేడుకలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోహిత్ విభిన్నమైన కథలు అంగీకరిస్తూ, వైవిధ్యమైన నటుడిగా నిరూపించుకున్నారని అన్నారు. ఈ రోజు ఆడియో వేడుక అని, ఆడియో ఒత్తిడిని పారద్రోలుతుందని ఆయన చెప్పారు. తాను కూడా మనిషినేనని, ఒత్తిడిలో ఉన్నప్పుడు సంగీతం వింటానని ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో సినిమా సంగీతం రణగొణ ధ్వనితో ఉంటోందని బాలకృష్ణ విమర్శించారు.