: పెదనాన్న ప్రోత్సహిస్తే...మావయ్య సలహాలిచ్చారు: నారా రోహిత్


'సినిమాల్లోకి వెళతాను' అనగానే తన తండ్రి నారా రామ్మూర్తినాయుడు 'సరే వెళ్లు' అని ప్రోత్సహించారని సినీ హీరో నారా రోహిత్ తెలిపాడు. 'సావిత్రి' ఆడియో వేడుక సందర్భంగా మాట్లాడుతూ, ఆ తరువాత సినిమా హీరో అవుతానని పెదనాన్నకు చెప్పానని అన్నాడు. పెదనాన్న నిత్యం ప్రోత్సహిస్తూనే ఉన్నారని రోహిత్ చెప్పాడు. 'బాణం' సినిమా తీసిన తరువాత ఏ సినిమా అంగీకరించాలి? ఎలా నటించాలి? ఎలా మసలుకోవాలి? వంటి విషయాల గురించి ఎన్నో విలువైన సలహాలను మావయ్య బాలయ్య ఇచ్చారని అన్నాడు. కుటుంబ వేడుకల్లో ఎప్పుడు కలిసినా, తానేం చేస్తున్నానో మావయ్య తెలుసుకునేవారని రోహిత్ తెలిపాడు. తనకు 'సోలో' ఎంతటి విజయం కట్టబెట్టిందో 'సావిత్రి' సినిమా కూడా అంతటి విజయాన్ని అందిస్తుందని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News