: మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకును బంజారా హిల్స్ స్థానికులు చితక్కొట్టి... పోలీసులకు అప్పగించారు!


ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ ను హైదరాబాదు, బంజారాహిల్స్ లో స్థానికులు చితక్కొట్టారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు తప్పతాగిన రావెల సుశీల్ బంజారాహిల్స్ లో రోడ్డుపై వెళ్తున్న ఫాతిమా బేగం (టీచర్) అనే వివాహిత మహిళను అడ్డగించాడు. అనంతరం ఆమెను కారు ఎక్కాలని కోరాడు. అంతేకాకుండా, ఆమెను చేయిపట్టి కారులోకి లాగాడు. దీంతో దగ్గరలోనే ఉన్న భర్తకు ఆమె విషయం తెలిపింది. దీంతో అతను స్థానికులతో కలసి కారును వెంబడించి, ఆపారు. ఆపై స్థానికులు సుశీల్ ను, ఆ కారు డ్రైవర్ అప్పారావును బయటకు లాగి చితకబాదారు. ఇంతలో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సుశీల్ రెచ్చిపోయి, తన ప్రతాపం చూపిస్తానంటూ వీరంగం వేశాడు. అప్పటి వరకు ఆయన మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడని స్థానికులకు తెలియకపోవడం విశేషం. కాగా, ఈ ఘటనలో స్థానికులు, బాధితురాలు అతనిపై కిడ్నాప్ ఫిర్యాదు చేయగా, పోలీసులు డ్రైవర్ అప్పారావుపై ఈవ్ టీజింగ్ కేసు పెట్టడం విశేషం. స్థానికులు పట్టుకున్న సందర్భంగా సుశీల్ చెబుతూ ...మహిళలను ఏదయినా చేయవచ్చని ఖురాన్ లో ఉందని వ్యాఖ్యానించాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, అతను ప్రయాణించిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News