: టీమిండియాకు తిరుగులేదు...ఏ జట్టునైనా ఓడించగలదు: ధోనీ


టీట్వంటీల్లో భారత జట్టుకు తిరుగులేదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధీమాగా చెప్పాడు. ఆసియాకప్ ఫైనల్ కు చేరడంపై ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియా పటిష్ఠంగా ఉందని ధోనీ పేర్కొన్నాడు. ఆసియాకప్ ఫైనల్లో ఆతిథ్య బంగ్లాదేశ్ ను ఎదుర్కోవడం సవాలని చెప్పాడు. అభిమానుల మద్దతు, పిచ్ బంగ్లాదేశ్ కు లాభిస్తుందని అభిప్రాయపడ్డ ధోనీ, అందులో టీమిండియాకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడు. ఫైనల్ కు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతామని ధోనీ చెప్పాడు. టీమిండియాలో 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉండడం కలసివచ్చే అంశమని ధోనీ అన్నాడు. బంగ్లాదేశ్ ను కట్టడి చేసే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని ధోనీ చెప్పాడు. ఫైనల్లో విజయం సాధించడం టీట్వంటీ వర్డల్ కప్ ముందు జట్టులోని ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుందని ధోనీ తెలిపాడు.

  • Loading...

More Telugu News