: పెరుగుతో హైబీపీకి చెక్ పెట్టొచ్చు!


ఆహారంలో పెరుగు తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు (హై బీపీ)కు చెక్ పెట్టవచ్చు. ఈ విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. వారానికి ఐదారు కప్పుల పెరుగు తీసుకునేవారిలో హై బీపీ వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. అమెరికాకు చెందిన బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకుడు ఒకరు ఈ అంశంపై అధ్యయనం చేశారు. పాలు, పాల పదార్థాలతో తయారయ్యే ఆహార పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో నిత్యం ఉండేలా చూసుకోవాలని సూచించారు. ‘మధ్య వయస్కుల్లో రక్తపోటు-పెరుగు ప్రభావం’పై అధ్యయనం కోసం ఆయా వయస్సులకు సంబంధించిన పురుషులు, మహిళలను ఎంచుకుని వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అధిక మొత్తంలో పెరుగు తీసుకునే వారు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే వారి ఆరోగ్యంలో తేడాలను ఈ అధ్యయనం ద్వారా గుర్తించారు.

  • Loading...

More Telugu News