: బంగారం కోసం సిరియాలో ఐఎస్ఐఎస్ విధ్వంసం
బంగారం కోసం ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు సిరియాలో విధ్వంసం కొనసాగిస్తున్నారు. ఇరాక్ లోని ఓ సమాధిలో వేల కోట్ల విలువైన బంగారం దొరికిందని ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. దీంతో సమాధులు, దేవాలయాల్లో అప్పటి రాజులు బంగారాన్ని దాచుకున్నారని భావించిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వారసత్వ సంపదను కూల్చివేస్తున్నారు. డమాస్కస్ పరిసరాల్లోని పాల్మాయ్ రా నగరంలోని ప్రపంచ వారసత్వ సంపదగా విరాజిల్లిన బాల్ షామిన్ ఆలయాన్ని బాంబులతో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కూల్చివేశారు. ఈ నగరానికి ముఖద్వారంగా విలసిల్లిన ట్రంప్ ను కూడా కూల్చేశారు. పురాతన రాచరిక చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన రాజుల టూంబ్స్ (సమాధులు) ను కూల్చేశారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వస్తున్నారన్న సమాచారం అందడంతో పురావస్తు శాస్త్రవేత్తలు 2015లోనే అక్కడి విలువైన వస్తువులను, విగ్రహాలను తరలించారు. దీంతో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రిక్తహస్తాలతో వెనుదిరిగారని వారు వెల్లడించారు. బంగారం కోసం బాంబులు పెట్టి సమాధులను పేల్చివేయడంతో ఆ ప్రాంతమంతా శిథిలాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా రాళ్లు గుట్టలుగా పడి ఉన్నాయి.