: ఆ 'బర్త్ డే' వండర్ ‘గిన్నిస్’కెక్కింది!


బర్త్ డే అంటేనే ప్రత్యేకమైన రోజు. మరి, అటువంటి ప్రత్యేకమైన రోజుకు మరింత ప్రత్యేకత చేకూరే సందర్భాలూ ఉంటాయా అంటే ఉండవచ్చనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే.. అదేరోజు.. పెళ్లిరోజు కావడమో, పిల్లలు పుట్టడమో, ఉద్యోగం రావడమో.... వంటి సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగే అవకాశాలు ఉంటాయి కనుక. అయితే, ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు పుట్టిన రోజులు ఒకే తేదీన రావడం... అదీ కూడా నాలుగేళ్ల కొకసారి వచ్చే లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తేదీనాడే జరిగితే ఆ తల్లిదండ్రులకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కలుగక మానదు. సరిగ్గా ఇలాంటి వండరే.. అమెరికాకు చెందిన చాద్, మెలిస్సా దంపతుల కుటుంబంలో జరిగింది. ఆ దంపతులకు ఫిబ్రవరి 29, 2012న అదయా అనే అమ్మాయి పుట్టింది. మళ్లీ నాలుగేళ్లు తిరిగేసరికి, అదే రోజున మరో చిన్నారి వారికి జన్మించింది. ఇక చెప్పేదేముంది... చాద్, మెలిస్సాల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఇది అరుదైన సంఘటన కనుక గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. కాగా, ఇటువంటి సంఘటన అమెరికాలో 1952-1966 సంవత్సరాల మధ్య జరిగింది.

  • Loading...

More Telugu News