: పాకిస్థాన్ గెలుస్తుందని పందెం కాసి ప్రాణం తీసుకున్నాడు
పాకిస్థాన్ లోని పంజాబ్ లోని మొహమ్మద్ షఫిక్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో జూనియర్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు. ఆయన క్రికెట్ కు వీరాభిమాని. పాకిస్థాన్, ఆతిథ్య బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ గెలుస్తుందంటూ తన నెల జీతం 30,000 రూపాయలను పందెం కాశాడు. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ఓటమిపాలైంది. దీనిని జీర్ణించుకోలేకపోయిన షఫిక్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.