: దారి తప్పితే దరిద్రమే: పోలీసు ఉద్యోగార్థులతో ఈటెల
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు తమ జీవితంలో ఎన్నడూ దారితప్పరాదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సలహా ఇచ్చారు. పోలీసు కానిస్టేబుళ్ల పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, కన్నవారి ఆశయ సాధన కోసం కృషి చేయాలే తప్ప, అందివచ్చిన టెక్నాలజీ సాయంతో దారితప్పి దరిద్రాన్ని కొని తెచ్చుకోవద్దని సూచించారు. సెల్ ఫోన్లు, టెలివిజన్ చానళ్ల కారణంగా మానవ సంబంధాలు చెడిపోతున్నాయని అభిప్రాయపడ్డ ఆయన, వీణవంక ఘటనలో బాధితులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కేసు సత్వర విచారణకై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నట్టు తెలిపారు.