: మసూద్ తల తెస్తే, ధర్మశాలలో ఆడొచ్చు: మాజీ సైనికుల ఆఫర్


ధర్మశాల వచ్చి ఇండియాతో క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే, మౌలానా మసూద్ అజర్ తలను తీసుకురావాలని మాజీ సైనికులు పాక్ ముందు సరికొత్త ఆఫర్ ఉంచారు. మసూద్ తలను తెస్తేనే ఆడనిస్తామని ఇండియన్ ఎక్స్ సర్వీస్ మెన్ లీగ్ హిమాచల్ ప్రదేశ్ అధ్యక్షుడు మేజర్ విజయ్ సింగ్ మన్కోటియా వెల్లడించారు. మార్చి 19న ధర్మశాలలో భారత్, పాక్ మ్యాచ్ జరగాల్సి వుండగా, కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రభుత్వం, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, దీన్ని నిర్వహించలేమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ధర్మశాలలో మ్యాచ్ కోసం 7 వేల మంది కాశ్మీరు గుండా హిమాచల్ లోకి ప్రవేశిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని ఆయన గుర్తు చేస్తూ, వాళ్లు పాకిస్థాన్ జెండాలను మైదానంలో ప్రదర్శిస్తే, పరిస్థితి మరింత అదుపు తప్పుతుందని, ఈ కారణం చేతనే మ్యాచ్ వద్దని చెబుతున్నామని మన్కోటియా తెలిపారు.

  • Loading...

More Telugu News