: రియల్ లైఫ్ లో అయితే అమ్మానాన్నల టాటూ వేయించుకుంటా: సినీ హీరో నాని


రియల్ లైఫ్ లో అయితే తన అమ్మానాన్నల టాటూను వేయించుకుంటానని ప్రముఖ హీరో నాని అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ యువహీరో మాట్లాడాడు. తాను నటించిన సినిమాల్లో ఆయా కథలను పచ్చబొట్టు పొడిపించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఒకవేళ నిజజీవితంలో ఈవిధంగా చేయాల్సి వస్తే కనుక తన తల్లిదండ్రుల పచ్చబొట్టునే పొడిపించుకుంటానని చెప్పారు. అన్ని రకాల చిత్రాల్లో నటిస్తానని, మాస్ సినిమాలంటే ఇష్టమని చెప్పాడు. మాస్ సినిమాలంటే ఇష్టమే కానీ, అందులో లాజిక్ ఉండాలని అన్నాడు. చిరంజీవి నటించిన ఇంద్ర, రజనీకాంత్ బాషా, నరసింహ వంటి మాస్ చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఒక చిత్రం బ్లాక్ బ్లస్టర్ అయిపోయిందని చెప్పి అదే తరహా చిత్రాలు చేయనని నాని చెప్పాడు.

  • Loading...

More Telugu News