: రూ. 10 వేల కన్నా తక్కువ ధరలో లభించే 4జీ స్మార్ట్ ఫోన్లు


3జీ ఫోన్లు పోయి 4జీ ఫోన్ల యుగం వచ్చేసింది. శాంసంగ్ నుంచి లావా వరకూ, ఎల్ జీ నుంచి సెల్ కాన్ వరకూ అన్ని కంపెనీలూ 4జీ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరలకు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో రూ. 10 వేల కన్నా తక్కువ ధరకు లభించే కొన్ని 4జీ మోడల్ ఫోన్ల వివరాలివి. మోటో జీ: బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఉత్తమమైనదని నిపుణులు విశ్లేషించిన ఫోన్ ఇది. 5 అంగుళాల గొరిల్లా గ్లాస్, 1.4 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 13/5 ఎంపీ కెమెరా సౌకర్యాలుండే దీని ధర రూ. 9,999. లెనోవో వైబ్ పీ1ఎం: రెండు సిమ్ కార్డ్ స్లాట్లలోనూ 4జీకి మద్దతిచ్చే ఈ ఫోన్ లో 4-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ రామ్, 16 జీబీ మెమొరీ, 3,900 ఎంఎహచ్ బ్యాటరీ, 8/5 ఎంపీ సౌకర్యాలున్నాయి. దీని ధర రూ. 7,999. శాంసంగ్ గెలాక్సీ ఆన్5: శాంసంగ్ అందిస్తున్న 4జీ వేరియంట్లలో ఇదే అతి తక్కువ ధరలో లభించేది. 5 అంగుళాల స్క్రీన్, 1.5 జీబీ రాం, 128 జీబీకి సపోర్ట్ ఇచ్చే మైక్రో ఎస్డీ కార్డు, 8/5 ఎంపీ కెమెరాలతో లభించే ఫోన్ ధర రూ. 8,190. కూల్ పాడ్ నోట్ 3 లైట్: 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీబఈ రామ్, 16 జీబీ మెమొరీ, 13/5 ఎంపీ కెమెరా సదుపాయాలతో లభించే ఫోన్ ధర రూ. 6,999 మాత్రమే. జియోమీ రెడ్ మీ 2 ప్రైమ్: ఈ ఫోన్ ధర ఇటీవల దిగివచ్చింది. 4.7 అంగుళాల డ్రాగన్ ట్రయల్ హెచ్డీ గ్లాస్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్ సదుపాయాలున్న దీని ధర రూ. 6,999. ఎటొచ్చీ ఫ్రంట్ కెమెరా కేవలం 2 ఎంపీకి పరిమితం కావడం కొంత నిరుత్సాహం. మైజూ ఎం2 నోట్: 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 13/5 ఎంపీ కెమెరాలతో పాటు 3,100 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే దీని ధర రూ. 9,999. ఆసుస్ జన్ ఫోన్ మ్యాక్స్: ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ ఉండేలా 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. 5.5 అంగుళాల హై డెఫినిషన్ గొరిల్లా గ్లాస్, 1.2 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ రామ్, 16 జీబీ మెమొరీ, 13/5 ఎంపీ కెమెరాలతో లభించే దీని ధర రూ. 9,999. ఏసర్ లిక్విడ్ జడ్ 530: రూ. 6,999కి లభించే ఈ ఫోన్ లో 5 అంగుళాల స్క్రీన్, 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2,420 ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది. ముందూ, వెనుకా 8 ఎంపీ కెమెరాలు దీనికి ప్రత్యేక ఆకర్షణ.

  • Loading...

More Telugu News