: ఆమె జీవితం ‘రంగీలా’ లా ఉండాలని కోరుకుంటున్నాను: రాంగోపాల్ వర్మ
బాలీవుడ్ నటి ఊర్మిళ మతోంద్కర్, కాశ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త, మోడల్ అయిన మొహ్సిన్ అక్తర్ మిర్ ను నిన్న వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఊర్మిళకు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తన ట్వీట్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘నేను పని చేసిన హీరోయిన్లలో చాలా అందంగా ఉండే నటి ఊర్మిళ. ఆమె పెళ్లి వార్త నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఆమె జీవితం ‘రంగీలా’ లా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా, అనగనగా ఒకరోజు, సత్య, భూత్, ప్యార్ టూన్ క్యాకియా, దౌడ్, జంగిల్, కౌన్ వంటి పలు చిత్రాల్లో ఊర్మిళ నటించింది.