: ఇలాగైతే వరల్డ్ టీ-20ని బహిష్కరిస్తాం: హెచ్చరించిన పాకిస్థాన్


తమ జట్టుకు పూర్తి భద్రత కల్పించడంలో భారత్ విఫలమవుతుందని భావించే పక్షంలో ఇండియాలో జరగనున్న వరల్డ్ టీ-20 పోటీలను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్ హెచ్చరించారు. ఈ నెల 19న హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పాక్ తో భారత్ ఆడాల్సి వుండగా, ఆ మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో షహర్యార్ స్పందించారు. "మా అనుమానాలను ఇప్పటికే ఐసీసీ ముందుంచాం. భారత ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన కోరుతున్నాం. మా జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. అటువంటి ప్రకటన ఇంతవరకూ రాలేదు. మేము భారత్ కు వెళ్లేందుకు మా దేశం అనుమతించింది. కానీ, బీసీసీఐ, మోదీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి సమాచారమూ లేదు. ఇదంతా ఆ దేశ అంతర్గత రాజకీయం. పరిస్థితి ఇలాగే ఉంటే టోర్నీని బహిష్కరిస్తాం" అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News