: అవన్నీ విభజనకు ముందే కొన్నా: 'భూదందా'పై సుజనా చౌదరి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలో తాను భూములను విభజనకు పూర్వమే కొనుగోలు చేశానని, కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఏపీలో వెలుగులోకి వచ్చిన భూదందాపై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఎటువంటి భూములనూ కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని తెలిపారు. పత్రికల్లో వస్తున్న వార్తలపై విచారణ జరిపించాలా? వద్దా? అన్న విషయమై సీఎం నిర్ణయిస్తారని వెల్లడించిన సుజనా చౌదరి, ఈ తరహా విమర్శలతో రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందని అన్నారు.