: 8న శ్రీవారి ఆలయం మూసివేత
ఈ నెల 9వ తేదీన సూర్యగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని కొన్ని గంటల పాటు మూసివేయనున్నారు. 8వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి మర్నాడు ఉదయం 10.00 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. సూర్యగ్రహణం ముగిసిన అనంతరం ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం తిరిగి స్వామి దర్శనానికి భక్తులను అనుమితిస్తామని చెప్పారు. తిరుమలలోని కల్యాణ వేదికలో వివాహం చేసుకున్న వారికి ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తామని, వివాహానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను దేవస్థానం సమకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. వెయ్యి కాళ్ల మండపం టెండర్లు దాఖలుకు తుది గడువును ఈ నెల 11 వరకు పొడిగించినట్లు సాంబశివరావు పేర్కొన్నారు.