: 77 ఏళ్ల వయసులో 47వ సారి టెన్త్ పరీక్షలకు!
పట్టు వదలని విక్రమార్కుడికి ఉదాహరణగా ఎవరినైనా చెప్పాలంటే, అతని పేరే చెప్పాలి. అతని పేరు శివ చరణ్ యాదవ్. రాజస్థాన్ లోని ఖోహారీ గ్రామానికి చెందిన ఇతను తొలిసారిగా 1968లో పదవ తరగతి పరీక్షలు రాశాడు. అప్పటి నుంచీ రాస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకూ 46 సార్లు పరీక్షలు రాసి తప్పిన శివ చరణ్, ఈ సంవత్సరం, తన 77వ ఏట మరోసారి పుస్తకాలు ముందేసుకుని కుస్తీ పడుతున్నాడు. పదవ తరగతి పాసైన తరువాత మాత్రమే వివాహం చేసుకోవాలని ప్రతిజ్ఞపూనిన శివ చరణ్, ఈ సంవత్సరం ఎలాగైనా పాస్ అవుతానని అంటున్నాడు. "ప్రతిసారీ ఏదో ఒకటి రెండు పరీక్షల్లో తప్పుతున్నాను. ఉదాహరణకు మ్యాథ్స్, సైన్స్ లో పాస్ మార్కులు వచ్చిన సమయంలో హిందీలోనో, ఇంగ్లీష్ లోనో తప్పుతున్నాను. ఈసారి అలా జరగనీయను. ఈ ఏడు స్కూలుకు వెళ్లి పాఠాలు కూడా విన్నాను" అని అంటున్నాడు. 1995లో 21 ఏళ్ల క్రితం పరీక్ష రాసినప్పుడు మ్యాథ్స్ తప్ప మిగతా అన్నీ పాసైన శివచరణ్, గత సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో తప్పాడట.