: టీడీపీలో చేరిన పాతపట్నం ఎమ్మెల్యే... చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కిన వైనం


ఏపీలో టీడీపీ ప్రారంభించిన ‘ఆకర్ష్’ ఫలితంగా ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి చేయిచ్చేశారు. విడతలవారీగా టీడీపీలో చేరిపోయారు. తాజాగా నేడు వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సైకిలెక్కేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై విజయం సాధించిన కలమట వెంకటరమణ ఇంతకు మునుపే తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం విజయవాడకు వచ్చిన కలమట టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరిపోయారు. కలమట తండ్రి, మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు కూడా నేడు టీడీపీలో చేరారు.

  • Loading...

More Telugu News