: టీడీపీ నుంచి సస్పెండ్ చేశారుగా... ఇక నోటీసులెందుకు?: స్పీకర్ నోటీసులపై ఎర్రబెల్లి కామెంట్


టీ టీడీపీకి షాకిస్తూ తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పంచన చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎర్రబెల్లి సహా ఐదుగురిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలన్న టీ టీడీపీ ఫిర్యాదు మేరకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నిన్న నోటీసులు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నోటీసులపై స్పందించిన ఎర్రబెల్లి ‘‘టీడీపీ ఇప్పటికే మమ్మల్ని సస్పెండ్ చేసింది. ఇక నోటీసులు ఎందుకు?’’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే మిగిలిన నలుగురు ఈ నోటీసులపై స్పందించేందుకు నిరాకరించారు.

  • Loading...

More Telugu News